అంతర్జాతీయ స్థాయిలో పరీక్షల నిర్వహణకు NTA సన్నాహాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: భారతదేశం
దేశంలో పరీక్షల విధానాన్ని మరింత పటిష్టం చేసిన తర్వాత, అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. బ్రిక్స్ దేశాలతో సహా విదేశీ సంస్థలతో కలిసి పనిచేయాలని ప్రణాళికలు రచిస్తోంది. తొలి ప్రాధాన్యతగా దేశీయంగా పరీక్షల భద్రతను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వెల్లడించారు. భవిష్యత్తులో నీట్-యూజీని కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్కు మార్చే ఆలోచనలో ఉన్నారు.