అదియాలా జైలు ముట్టడి ప్రయత్నాలు విరమించాలని కాసిమ్ ఖాన్ విజ్ఞప్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: Rawalpindi

పాకిస్థాన్ అదీయాలా జైలు వైపు ప్రదర్శన చేపట్టవద్దని పీటీఐ మద్దతుదారులను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిమ్ ఖాన్ కోరారు. సెప్టెంబర్ 27న తలపెట్టిన నిరసన ప్రదర్శనలో జైలును ముట్టడిస్తే తన తండ్రి ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జైలుపై దాడికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఇవ్వవద్దని ఎక్స్ వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు. పంజాబ్ ప్రావిన్స్లో ఇప్పటికే సెక్షన్ 144 అమల్లో ఉండగా, ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.