మోహన్‌లాల్ 'L367' చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్ సిద్ధం
రిపోర్టర్: అశోక్
స్థలం: India
నేషనల్ అవార్డ్ విజేత విష్ణు మోహన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'L367'. ఈ సినిమాకు సంబంధించి శనివారం ఉదయం 11:11 గంటలకు కీలక ప్రకటన చేయనున్నట్లు దర్శకుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.