నితారి హత్యల కేసు నిందితుడు సురీందర్ కోలి ఆత్మహత్య
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హరిద్వార్
రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన 2006 నితారి సీరియల్ హత్యల కేసులో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. భుపత్‌వాలా ప్రాంతంలోని ఒక టీ స్టాల్ వద్ద ఆయన ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆయనను ఆఖరి కేసులోనూ నిర్దోషిగా తేల్చి విడుదల చేసిన విషయం తెలిసిందే.