కోలీవుడ్ లో రీఎంట్రీ: సూర్య చిత్రంలో నటి నజ్రియా నాజిమ్ కీలక పాత్ర

రిపోర్టర్: విజయ్ స్థలం: Kerala

కోలీవుడ్ లో పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అగ్ర హీరో సూర్య నటించిన 'సీన్' సినిమాతో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రముఖ నటి నజ్రియా నాజిమ్ తెలిపారు. సూర్య చిత్రాల్ లో తాను నటించకుండా కావాలనే తిరస్కరించలేదని, కేవలం డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్లే ఆ అవకాశాలు రాలేదని ఆమె స్పష్టం చేశారు. కేరళలో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న నజ్రియా, దర్శకుడు జీతు మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తాను తొలిసారిగా యాక్షన్ సన్నివేశాల్ లో నటించినట్లు వెల్లడించారు.