కాలేజీల్ లో ఇష్టారాజ్యంగా ఈవెంట్లు: కట్టడి చేసేందుకు కొత్త చట్టం తెచ్చిన సర్కార్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్ లో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట సాగుతున్న ఇష్టారాజ్యాన్ని కట్టడి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. విద్యార్థుల భద్రతను కాపాడేందుకు తెలంగాణ ఈవెంట్స్ ఫెసిలిటేషన్ అండ్ సేఫ్టీ బిల్లు-2026 ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించామని, ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామని ఆయన వెల్లడించారు.