ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియను పురపాలక శాఖ ప్రారంభించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నెల 11 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 13న తుది ప్రకటన విడుదల చేస్తారు. 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్లన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.