అంతర్జాతీయ సంగీత సంచలనం: మాజీ మేనేజర్లపై టింబాలాండ్ భారీ దావా
రిపోర్టర్: సతీష్
స్థలం: Los Angeles
ప్రముఖ సంగీత నిర్మాత టింబాలాండ్ తన మాజీ మేనేజర్లపై కోర్టులో దావా వేశారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. మోసం, విశ్వాస ఘాతకం ఆరోపిస్తూ ఏడు మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ లాస్ ఏంజెల్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక రికార్డులను తారుమారు చేసి తమను మోసం చేశారని, రాయల్టీ హక్కులను కోల్పోయేలా చేశారని ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలను మాజీ మేనేజర్ గ్యారీ మారెల్లా ఖండించారు.