తొమ్మిదో తరగతి గణిత సిలబస్పై వస్తున్న ఆందోళనలను ఖండించిన ఎన్సీఈఆర్టీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

తొమ్మిదో తరగతి గణిత సిలబస్లో ఎలాంటి పాఠ్యాంశాలను తొలగించలేదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ అధికారులు సెప్టెంబర్ 25వ తేదీన అధికారిక ప్రకటన విడుదల చేశారు. సిలబస్లో కొన్ని అంశాలను ఇతర అధ్యాయాల్లో చేర్చడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు వివిధ భావనలపై మెరుగైన అవగాహన కల్పించేందుకే ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకే ముసాయిదాను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు.