దానం అనర్హత తీర్పు ప్రజాస్వామ్య విజయం అంటున్న వేముల ప్రశాంత్ రెడ్డి
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కీలకమైన పరిణామం అని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలు గెలిపించిన తర్వాత పార్టీ మారడం ప్రజా తీర్పును దెబ్బతీయడమేనని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శించిన ఆయన, ఈ తీర్పు మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ స్పష్టమైన గుణపాఠం అని హెచ్చరించారు.