ఒడిశాలో పీజీ రెండో విడత ప్రవేశాల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Odisha

ఒడిశాలో పీజీ కోర్సుల రెండో విడత ప్రవేశాల షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఎస్ఏఎంఎస్ పోర్టల్ ద్వారా అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకొని లాక్ చేయవచ్చు. సెప్టెంబర్ 24న తొలి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల కానుంది. అక్టోబర్ 5 వరకు తుది ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుంది.