స్థానిక పోరులోనూ జనసేన జోరు: వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయవాడ
సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్ లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా విజయవాడ మేయర్ స్థానంలో వంగవీటి రాధాకృష్ణ భారీ విజయం సాధించడంతో పాటు ఏలూరు కార్పొరేషన్ లోనూ జనసేన పార్టీ తిరుగులేని రికార్డును నమోదు చేసింది.