రోడ్డు అభివృద్ధి పనులు నిలిపివేత: ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు తీవ్ర ఆవేదన

రిపోర్టర్: అశోక్ స్థలం: కొండాపురం

కలిగిరి నుంచి కొండాపురం వరకు రోడ్డు అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. అయిదేళ్ల క్రితం ముప్పై కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. దీంతో మార్గమధ్యంలో గోతులు ఏర్పడి వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పనులు పునఃప్రారంభించినా, అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.