అంబీర్ చెరువు కట్టపై నూతన వీధి దీపాలు ప్రారంభం
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు కట్టపై రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్, 40 వీధి దీపాలను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు, వాకర్లకు అసౌకర్యం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశామన్నారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.