ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విజయవాడలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: ఎన్టీఆర్

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు Vijayawada City Police వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక సీసీటీవీలు, ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలతో ఈ బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. ముగ్గురు ఎస్పీలు, ఒక అడిషనల్ డీసీపీ, 17 మంది ఏసీపీలు, 37 మంది ఇన్స్పెక్టర్లతో పాటు మొత్తం 1,076 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని విధుల్లో నిమగ్నం చేసినట్లు పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేసినట్లు ట్వీట్ చేశారు.