జ్వరపు కోరల్లో చిక్కి విలవిల్లాడి ప్రాణాలు విడిచిన పసిప్రాయపు బాలుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నాగలాపురం

నాగలాపురం మండలం కస్తూరినాయుడుకండ్రిగ గ్రామంలో జ్వరాల తీవ్రతకు 9వ తరగతి విద్యార్థి కార్తికేయన్ చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో గత పది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ వైద్య శాఖ స్పందించకపోవడంతో నిరుపేద కుటుంబం రోదిస్తోంది. తక్షణమే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.