గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లలో యూపీఐ కొత్త నిబంధనలపై తీవ్ర ఆందోళన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ లావాదేవీల నిబంధనలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రూ. 2000 కంటే ఎక్కువ విలువైన ప్రతిపాదిత మర్చంట్ లావాదేవీలపై రూ. 5 ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించే ప్రతిపాదన గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, డెలివరీ సమయాల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఏజెన్సీలలో డెలివరీ బాయ్స్ వ్యక్తిగత యూపీఐ ఖాతాల ద్వారా డబ్బులు సేకరించి సాయంత్రానికి ఏకమొత్తంగా బదిలీ చేస్తుండటంతో ఇది ఎండీఆర్ పరిధిలోకి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఈ విచిత్ర పరిస్థితి వల్ల గ్యాస్ ఏజెన్సీలు తిరిగి నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, ఎల్‌పిజి పంపిణీ రంగాన్ని ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయించాలని ప్రతినిధులు కోరుతున్నారు.