పసిఫిక్ మహాసముద్రంలో వేలాది రేడియోధార్మిక వ్యర్థాల డ్రమ్ములు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమెరికా
అమెరికా ప్రభుత్వం 1946 నుండి 1970 మధ్య కాలంలో శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 48 వేల రేడియోధార్మిక వ్యర్థాల కంటెయినర్లను పడవేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫరాల్లోన్ ద్వీపాల సమీపంలో సముద్ర గర్భంలో పేరుకుపోయిన ఈ ఉక్కు డ్రమ్ముల వల్ల సముద్ర ఆవరణ వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.