ఏపీ ప్రభుత్వ ప్రకటనల్లో ఇంకా మంత్రుల ఫోటోలు మాయం
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారిక ప్రకటనల్లో ప్రోటోకాల్ పాటించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని బేఖాతర్ చేస్తున్నారు. తాజాగా విడుదలవుతున్న ప్రభుత్వ ప్రకటనలు మరియు సోషల్ మీడియా పోస్టర్లలో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల ఫోటోలకే ప్రాధాన్యం దక్కుతుండటంతో, సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలు కనుమరుగవుతున్నాయి. సీఎం హెచ్చరించినప్పటికీ ఐఅండ్‌పీఆర్ శాఖ తీరు మారని కారణంగా కేబినెట్లోని పలువురు మంత్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.