స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్వోసీ మరియు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్వోసీ నిబంధన స్థానిక సంస్థల ఎన్నికల చట్టంలో లేదని పేర్కొంటూ, దీనికోసం నామినేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపవద్దని ఎన్నికల అధికారులను ఎస్ఈసీ తేల్చిచెప్పింది.