కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాండింగ్ కౌన్సెల్గా సుధాకర్ రెడ్డి

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

వేదురుకుప్పం మండలం అగ్గిచెనుపల్లి పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది కామసాని సుధాకర్ రెడ్డిని భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సెల్గా నియమించారు. ఇప్పటికే పలు కేంద్ర సంస్థలకు సేవలందిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం గర్వకారణం.

గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి కేంద్ర ప్రభుత్వంలోని ప్రతిష్టాత్మక సంస్థలకు న్యాయ ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టడం వేదురుకుప్పం మండలానికి గర్వకారణంగా నిలిచింది. ఈ నియామకంపై పలువురు ప్రముఖులు, గ్రామస్థులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.