రామగుండంలో ఆంక్షల ఉక్కుపాదం మోపిన సీపీ అంబర్ కిషోర్
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేని డీజేలు, ధర్నాలు, ర్యాలీలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ఈ నిబంధనలు డిసెంబర్ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయని, ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.