నెల్లూరు జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరుకు ఎదురుచూపులు
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ల కోసం పది కేటగిరీల్లో అరవై ఐదు వేల దరఖాస్తులు అందాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.నాగరాజకుమారి తెలిపారు. సచివాలయాల ద్వారా ఆన్లైన్ చేసిన ఈ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత నెలకు కొత్తవి మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందారని వెల్లడించారు. దళారులను ఆశ్రయించవద్దని, అర్హులందరికీ పారదర్శకంగా పింఛన్లు మంజూరు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.