తెలంగాణలో జనసేనను మరింత బలోపేతం చేయాలి: రామ్‌ తాళ్లూరి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఖమ్మం

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి పిలుపునిచ్చారు. ఖమ్మంలో నిర్వహించిన జనసేన తెలంగాణ శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల సమస్యలను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు, రైతులు, యువత సమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.